జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు సీఓఈ విద్యార్థి రిషి ఎంపిక
బెల్లంపల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ చెందిన ఆరవ తరగతి కి చెందిన వేల్పుల రిషి జాతీయ పోటీ లకు ఎంపికయ్యారు. 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్ 13 మినీ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ పోటిలో పాల్గొన్నారు.
16 అక్టోబర్ నుండి 17 అక్టోబర్ వరకు ఎల్బీ కాలేజ్ ములుగు రోడు హనుమకొండలో జరిగిన సాఫ్ట్బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ ఆల్ రౌండ్ ప్లేయర్ గా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయాడు. జాతీయ పోటీలకు ఎంపీకైనా విద్యార్థిని ప్రిన్సిపల్ ఆకిడి విజయసాగర్ అభినందించారు.
జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29,30 ,31 తేదీలలో మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ కోపర్గాన్ లో జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కాసల నవీన్ కుమార్, మంచిర్యాల జిల్లా సెక్రెటరీ బాసబోయిన కిరణ్ కుమార్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ దుర్గం రమాదేవి, కమలాకర్, శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ముచ్చ కుర్తి రాజశేఖర్, ఆలూరి వామన్ విద్యార్థికి పుష్పగుచ్చం సన్మానం చేశారు.