తాడువాయిలో ఘనంగా దసరా ఉత్సవాలు
తాడ్వాయి,అక్టోబర్,21( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో మంగళవారం దసరా ఉత్సవాలు(Dasara Celebrations) ఘనంగా జరిగాయి. మండలములోని గ్రామాల్లో దసరా పండుగ సందర్భంగా తాడ్వాయి లోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో,కృష్ణాజివాడి లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో(Sri Rajarajeswara Swamy Temple), సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో,నందివాడ బస్వన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలు నూతన వస్త్రాలు ధరించి జమ్మి కొట్టారు.
సాయంత్రం వేళలో గ్రామ శివారులోని ప్రాంతాలకు వెళ్లి అక్కడే పాలపిట్టను చూసి దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దేవాలయాలకు వెళ్లి బంగారం దేవుడికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాత్రి వేళలో డప్పు వాయిదద్యాలతో అందరు కలిసి వెళ్లి గ్రామ శివారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఎర్రపహాడ్,తాడువాయి, బ్రాహ్మణపల్లి,నందివాడ, ఎండ్రియాల,చిట్యాల, కృష్ణాజివాడి గ్రామాల్లో ప్రత్యేక సంబురాలు నిర్వహించారు.