రోడ్డుపై వరి ధాన్యం..

29-10-2026 | 05:35am

వాహనదారులూ జర భద్రం!

బిక్కనూర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): వరి కోతలు జోరుగా సాగుతున్న వేళ రైతులు(Farmers) ధాన్యాన్ని ఎండబెట్టే పనిలో మునిగిపోయారు. అయితే కొన్ని గ్రామాల లో కొందరు రైతులు తమకు కేటాయించిన కల్లాల్లో కాకుండా రోడ్లపైనే వరి ధాన్యాన్ని ఎండబెడుతున్నారు. దీంతో అటు వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మం డలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ రోడ్లపై ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందు తున్నారు.

రాత్రి వేళల్లో మరింత ప్రమాదం

పగటిపూట రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్ప లు కనిపించినా రాత్రి వేళ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా సింగిల్ రోడ్లపై ఎదురుగా మరో వాహనం వస్తున్నప్పుడు దాని లైట్ల వెలుతురు ఎదురుగా వెళ్తున్న మరొక్క వాహనం నడిపే వ్యక్తి కళ్ళల్లోకి నేరుగా పడటం వల్ల రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలు సరిగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు ధాన్యం కుప్పలపైకి వెళ్లడం లేదా రోడ్డు కనిపించక రోడ్డు కిందికి వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగే ముప్పు ఉంది.

రాళ్లు, కట్టెలు పెడితే ప్రమాదమే!

రోడ్డుపై ధాన్యం పోసిన కొందరు రైతులు వాహనదారులకు కనిపించేలా హెచ్చరికలు పెట్టకుండా రాళ్లు, కట్టెలు పెడుతున్నారు. చీక ట్లో అవి కనిపించకపోతే వాహనాలు వాటిని ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ధాన్యం కుప్పలపై దూరం నుంచే కనిపించేలా హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలి. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సొసైటీలు, ఐకేపీ కేంద్రాలు కల్లాలు ఏర్పాటు చేయాలి

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అవసరమైన కల్లాల ఏర్పాటుపై సొసైటీలు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు,అధికారులు దృష్టి సారించాలి. రైతులకు అందుబాటులో ఉన్న కల్లాల వివరాలను ముందుగానే చె ప్పాలి. ధాన్యాన్ని రోడ్లపై పోయకుండా కల్లాల్లోనే ఎండబెట్టుకునేలా రైతులకు అవగా హన కల్పించాలి. ఈ విషయంలో సొసైటీలు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, అధికా రులు బాధ్యత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కల్లాల్లోనే ధాన్యం ఆరబెట్టాలి

రైతులు వీలైనంత వరకు తమకు కేటాయించిన కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకో వాలి. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పక్కన ధాన్యం ఉంచాల్సి వస్తే వాహనదారులకు ముందుగానే కనిపించేలా హెచ్చరికలు ఏ ర్పాటు చేయాలి. దానివల్ల అటుగా వెళ్లే వా హనదారులకు హెచ్చరికలు కనిపించడం తో ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వాహన దారులు కూడా జాగ్రత్తపడాలి

కొన్ని గ్రామాల్లో రైతులు అత్యవసర పరిస్థితుల్లో వరిధాన్యం ఎండబెడితే వాహనదా రులు కూడా అప్రమత్తంగా ఉండలి. అటుగా వెళ్లే వాహనదారులురోడ్డుపై ధాన్యం కుప్ప లు ఉన్న చోట వేగం తగ్గించి జాగ్రత్తగా ప్ర యాణించాలి. ముఖ్యంగా రాత్రి సమయం లో మరింత అప్రమత్తంగా ఉండాలి. రైతు లు, సొసైటీలు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకు లు సమన్వయంతో వ్యవహరిస్తే ధాన్యం ఆరబెట్టే సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

‘రోడ్లపై ధాన్యం పోయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతులు పోలీసులకు సహ కరించాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుం ది. వాహనదారులు కూడా రోడ్లపై ధా న్యం కుప్పలు ఉన్న చోట అప్రమత్తంగా, నెమ్మదిగా ప్రయాణించాలి. రైతుల భద్రతతో పాటు ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బా ధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఎస్‌ఐ అనిల్, భిక్కనూర్

మరిన్ని వార్తలు