యోగాతో ఆరోగ్యం....ఆనందం....

15-10-2026 | 04:40pm

తాడ్వాయి,అక్టోబర్,15( విజయ క్రాంతి ): యోగాతో ఆరోగ్యం... యోగాతో ఆనందం.. యోగాతో సంపూర్ణ జీవనం(Complete Life) సాధించవచ్చని యోగా గురువు సంతత్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల  గ్రామంలో(Endriyala Village) గురువారం 50 రోజుల యోగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ఈ గ్రామంలో గత 50 రోజుల నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు యోగాలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని ఆయన సూచించారు.యోగ చేయడంతో మన ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికైన సంతాజి గారి సుధాకర్ రావు ను,గ్రామ సర్పంచ్ కొర్ని నరసింహులు, ఉప సర్పంచ్ నరసారెడ్డిలను  యోగా ప్రతినిధులు  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రెడ్డి గారి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు