రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి
పాంబండ పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
శివంపేట్ నవంబర్ 26 ( విజయక్రాంతి ): మెదక్ జిల్లా శివంపేట మండలం పాంబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కె. శ్రీధర్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని తెలిపారు.
రాజ్యాంగంలోని విలువలు, ఆశయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగల పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు చెన్ను నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన చెన్ను నాయక్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, చెన్ను నాయక్ తదితరులు పాల్గొన్నారు.