కన్నుల పండుగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం
ఘట్ కేసర్, నవంబర్ 26 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్(Edulabad Division), ఘనపురం గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు(Beneficiaries of Indiramma Houses scheme) మాలోత్ సుగుణ, మూడవత్ యాకుబ్ నాయక్, వడ్త్యా రతన్ సింగ్ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై ఇందిరమ్మ ఇండ్లను గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, డివిజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శంకర్ గౌడ్, కార్యదర్శి తాటికొండ మల్లేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు ననావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.