ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
26-11-2026 | 10:19pm
హన్వాడ : మండలంలోని యారోనిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ(Constitution Day of India) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎస్. స్వాతి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, పౌరుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీలత, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఉపసర్పంచ్ మైబమ్మ, బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షుడు ఎస్. తిరుపతయ్య, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు స్వామి, బుక్ కీపర్ సుజాత, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.