ఇందిరాగాంధీ స్టేడియంలో మళ్లీ దసరా ఉత్సవాలు
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా లేజర్ షో నిర్వహిస్తాం
స్టేడియంలో కోటి రూపాయలతో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల(Dasara Celebrations)ను షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ(Mohammed Shabbir Ali) తెలిపారు. శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఫ్లడ్‌లైట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దసరా ఉత్సవాలను పూన ప్రారంభించనున్నట్లు తెలిపారు. లేజర్ షో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కరోనా కారణంగా నిలిచిపోయిన ఉత్సవాలు పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఏటా దసరా ఉత్సవాలు, రావణ దహనం, లేజర్ షో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేవారమని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. కరోనా మహమ్మారి(Coronavirus pandemic) కారణంగా ఈ కార్యక్రమాలకు విరామం ఏర్పడిందని తెలిపారు. ఈ ఏడాది నుంచి తిరిగి దసరా ఉత్సవాలను ప్రారంభించ నిన్నట్లు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించాలన్నారు.
1990లో ప్రారంభమైన దసరా ఉత్సవాల ప్రస్థానం
1990లో తొలిసారిగా మల్లన్నగుట్ట వద్ద రావణ దహనం, లేజర్ షోతో దసరా ఉత్సవాలను ప్రారంభించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. అనంతరం నాలుగు సంవత్సరాల పాటు సీఎస్ ఐ గ్రౌండ్‌లో ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం, ఇందిరాగాంధీ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 20 సంవత్సరాల పాటు అక్కడే దసరా వేడుకలను ఘనంగా నిర్వహించామని వివరించారు.
అయితే కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిళ్లు, ఇతర అనివార్య కారణాల వల్ల గతంలో నాలుగు సంవత్సరాల పాటు ఉత్సవాలను నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరిగి ఉత్సవాలను పునఃప్రారంభించి, ఈ ఏడాది ఆకర్షణీయమైన లేజర్ షోతో పాటు రావణ దహనం, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.త్వరలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు పూర్తయితే క్రీడాకారులకు, క్రీడా కార్యక్రమాలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ కౌన్సిలర్లు అన్వార్, షేరు, సత్యం, సిద్దిక్, అంజాద్, యూనుస్, చిట్టిబాబు, గంగాధర్, లోలం శ్రీనివాస్, మామిళ్ళ లక్ష్మణ్, మన్సూర్, గేరిగంటి స్వప్న, పిట్ల వేణు, ఏజాజ్, కామారెడ్డి విండో చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజగౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూమని బాలరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అన్మాల రాము కుమార్, రామేశ్వర పల్లి విండో చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, నరేందర్ రెడ్డి, గొనె శ్రీనివాస్, ముబషీర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.