క్రీడా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట
చికితను ఆదర్శంగా తీసుకోవాలి!!
రెండు గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చింది.
సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తూ భారీ నిధులు కేటాయించి క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao) అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్ 6వ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు(Premier League cricket tournaments), సీజన్-2 ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఏషియన్ క్రీడల్లో రాణించిన ఆర్చరీ క్రీడాకారిణి చికితను ఆదర్శంగా తీసుకొని క్రీడాకారులు ముందుకెళ్లాలని సూచించారు. చికిత రెండు గోల్డ్ మెడలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులుతీసుకువచ్చారని, గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి చికిత దేశానికే ఆదర్శంగా నిలిచారని స్పష్టం చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు యువనేత బకం సాయికిరణ్ యాదవ్ సుల్తానాబాద్ ప్రీమియం లీగ్ను నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు.
యువత చెడు మార్గంలో నడవకుండా ఉండేందుకు క్రికెట్ పోటీలు ఎంతోదోహదంచేస్తాయన్నారు. సుల్తానాబాద్ క్రీడా రంగానికి పుట్టినిల్లని, యువత గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని సూచించారు. గెలుపు కోసం నిరంతరం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు యువత ను ప్రోత్సహించేందుకు సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాయని, పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలో పది టీములు నమోదు చేసుకొని, క్రికెట్ పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లు బిరుదు రాధాకృష్ణ, నుగిళ్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుక సతీష్,మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, సింగిలివిండో చైర్మన్ సామ రాజేశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుగ్యాల సంతోష్ రావు, ఎలిగేడు సర్పంచ్ కప్పల ప్రవీణ్, కాట్నపల్లి సర్పంచ్ ఓగుల పూజా రాజేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, పన్నాల రాములు, దేశెట్టి సందీప్ , కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.