రెడ్ క్రాస్ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు
కరీంనగర్,(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) కరీంనగర్ జిల్లా శాఖలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్ ఏవి రమణ(Former Corporator AV Ramana) ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం, ఉద్యోగుల సంఘాల ప్రభావం ఉందనే తీవ్రమైన అనుమానాలు తలెత్తాయని, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు, టీఎన్జీవోస్ కరీంనగర్ శాఖకు బాధ్యతను స్పష్టంగా పేర్కొంటూ తెలంగాణ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత పాలకవర్గాన్ని చట్టప్రకారం వెంటనే రద్దు చేయాలని, అవసరమైతే స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ లేదా తాత్కాలిక కమిటీని నియమించి, సభ్యత్వాలు, ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించిన అనంతరం స్వతంత్ర రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెడ్ క్రాస్ వంటి ప్రజాసేవా సంస్థలో అధికార యంత్రాంగం లేదా ఏదైనా ఉద్యోగుల సంఘం ప్రభావానికి తావులేకుండా, సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.