రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

28-10-2026 | 05:19pm

నిజాంసాగర్ అక్టోబర్ 28( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై(National Highway) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) తెలిపిన వివరాల ప్రకారం  లింగంపేట మండలం ముంబాజిపేట గ్రామానికి చెందిన వడ్ల రాములు  వయస్సు65, మంగళవారం రాత్రి 8:30  సమయంలో బూర్గుల్ గ్రామ శివారులో నీ జాతీయ రహదారి765 డి రోడ్డుపైన ప్రమాదవశాత్తు తనంతట తాను కింద పడగా తలకు గాయం కాగా బూరుగులు గ్రామస్తులు అంబులెన్స్ కి ఫోన్ చేసి పోలీసుల సహాయంతో బాన్సువాడ ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు.భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు