వచ్చామా.. వెళ్లామా అన్న చందంగా మండల సర్వసభ్య సమావేశం..

06-11-2026 | 05:53pm

అంతంతమాత్రమే... సగానికి పైగా సర్పంచుల గైర్హాజరు...

మండల స్థాయి అధికారుల స్థానంలో కిందిస్థాయి సిబ్బంది హాజరు...

బాన్సువాడ, నవంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన సమావేశం తూతూమంత్రంగా ముగిసినట్లు కనిపించింది. వచ్చామా... వెళ్ళామా... అన్న చందంగా  జరిగింది సమావేశం తీరు.

మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన సమావేశానికి సగానికి పైగా సర్పంచులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.మరోవైపు మండల స్థాయి అధికారులు స్వయంగా హాజరుకావాల్సి ఉండగా, వారి స్థానంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు లేని సమావేశం.. కీలక అధికారులు లేని సమీక్షగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన మండల సర్వసభ్య సమావేశం కేవలం హాజరు నమోదు చేసుకుని వెళ్లిపోయే కార్యక్రమంలా సాగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగకపోతే ఇటువంటి సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరై, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు