పలు గ్రామాల్లో దూడల నిర్మూలన కార్యక్రమం

06-11-2026 | 06:54pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని బొల్లారం, పల్లెబోగడతండా, జప్తి జాన్కంపల్లి, మెల్లకుంట తండా గ్రామాలలో దూడల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. బొల్లారం(Bollaram) గ్రామంలో 22 దూడలకు నులిపురుగుల నివారణ జరిగింది. పల్లెబొగడ తండలో 18 దూడలకు నులిపురుగుల నివారణ, జప్తి జాన్కంపల్లి 16 దూడలకు నులిపురుగుల నివారణ జరిగింది. మెల్ల కుంట తండలో 25 దూడలకు నులిపురుగుల నివారణ జరిగిందనీ మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ప్రభు గౌడ్, వర్షిణి పరమేష్, బాల్య నాయక్, పార్వతి శంకర్,పశువైద్యాధికారి రవి కుమార్, ఇబ్బంది విజయ, జయరాజ్, గౌస్, గంగారామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు