వర్షాలకు నేలకొరిగిన వరి పంట

06-11-2026 | 06:54pm

రైతుకు కాంగ్రెస్ నాయకుడు చలసాని రాజీవ్ 10 వేల ఆర్థిక చేయూత.

నేరేడుచర్ల,నవంబర్ 06(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని నర్సయ్యగూడెంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా వరి పంట(Paddy crop) నేలకొరిగి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.నర్సయ్యగూడెంకు చెందిన రైతు నన్నెపంగ రామలింగయ్య సాగు చేసిన ఎకరం వరి పంట పూర్తిగా నేలకొరగడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చలసాని రాజీవ్ వెంటనే పంట పొలాన్ని సందర్శించి,వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు.

నష్టపోయిన రైతు రామలింగానికి తన వంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.ఆపద సమయంలో రైతుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన చలసాని రాజీవ్ స్థానికులు అభినందించారు.రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు