జుక్కల్ లో ఉపాధి హామీ సామాజిక తనిఖీ
జుక్కల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): జుక్కల్ మండలం(Jukkal Mandal) పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ఏపీడి కుటుంబరావు అధ్యక్షతన జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్, కార్యదర్శులు హాజరయ్యారు. గత వారం రోజులుగా ఆడిట్ బృందం చేపట్టిన వివరాలను సామాజిక తనిఖీలో చదివి వినిపించారు.
2025 మార్చి 1 నుండి 2026 మార్చ్ 30 వరకు జరిగిన పనులకు అడిట్ నిర్వహించారు. అడిట్ బృందం పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సామాజిక తనిఖీకి సర్పంచులు ఒకరు కూడా హాజరు కాకపోవడం విశేషం. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఏపీవో తులసిరాం, ఈసి స్వామిదాస్, ఐదు బృందం అధికారులు పాల్గొన్నారు.