భూభారతిపై అవగాహన
రైతులకు భూముల హద్దులపై స్పష్టత వస్తుంది: సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్
కొల్చారం అక్టోబర్14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో(Bhu-Bharati Program) భాగంగా భూముల రీ సర్వేపై అవగాహన కల్పించేందుకు మండలంలోని అప్పాజీపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రీ సర్వే ప్రక్రియ, రైతులకు కలిగే ప్రయోజనాలు, రెవెన్యూ శాఖ చేపట్టనున్న చర్యలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ద్వారా రైతుల సర్వే నంబర్ల వారీగా పొలాల హద్దులపై స్పష్టత వస్తుందని తెలిపారు. దీంతో భూ వివాదాలు తగ్గి, రైతులకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, మండల సర్వేయర్ మొగులయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.