దుర్గామాత మహా అన్నదానానికి ఎస్పీకి ఆహ్వానం
14-10-2026 | 07:18pm
గణపురం,అక్టోబర్ 14 (విజయ క్రాంతి): బస్వరాజుపల్లి బస్టాండ్ వద్ద నేడు గురువారం దుర్గామాత మహా అన్నదానం(Goddess Durga's Maha Annadanam) నిర్వహించనున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ను బస్వరాజు పల్లి సర్పంచ్ చింతకుంట్ల సునీత, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరై దుర్గామాత ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.