మైలురాయి అందుకున్న ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా

14-10-2026 | 07:16pm

ముంబై: భారత్‌లో తన వృద్ధి ప్రయాణంలో ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా (Anytime Fitness India) ఒక కీలక మైలురాయిని అందుకుంది. ఈ ఫిట్‌నెస్ బ్రాండ్ 200 క్లబ్‌ల మార్కును దాటి, 45కు పైగా నగరాల్లో 2 లక్షలకు పైగా సభ్యులకు సేవలందిస్తోంది. ఈ మైలురాయిని అక్టోబర్ 5న దేశవ్యాప్తంగా వేడుకగా జరుపుకున్నారు. సభ్యులు, క్లబ్ బృందాలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో ఈ సందర్భానికి బలమైన కమ్యూనిటీ స్ఫూర్తి తోడైంది. 2030 నాటికి భారతదేశవ్యాప్తంగా 500 క్లబ్‌లకు చేరుకోవాలన్న బ్రాండ్ విస్తృత లక్ష్యం దిశగా ఈ విజయం మరో ముందడుగుగా చెబుతున్నారు.

ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వికాస్ జైన్(Managing Director Mr. Vikas Jain) మాట్లాడుతూ, “200+ క్లబ్‌ల మార్కును దాటడం ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియాకు గర్వకారణమైన మైలురాయి. అయితే ఈ సంఖ్య వెనుక ఉన్న వ్యక్తులే దీనిని ప్రత్యేకంగా నిలుపుతున్నారు. ఈ ప్రయాణానికి మా సభ్యులే నిజమైన అంబాసిడర్లు. వారి లక్ష్యాలు, సవాళ్లు, పురోగతి, ప్రతిరోజూ వారు చూపే నిబద్ధత — ఇవన్నీ కలిసే భారతదేశవ్యాప్తంగా మేం నిర్మించిన కమ్యూనిటీకి రూపమిచ్చాయి. మరింత మంది ఫిట్‌నెస్‌ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటున్నందువల్లే మేం ఎదిగాం. మా తదుపరి ప్రయాణంపై ఇది మాకు మరింత విశ్వాసాన్ని ఇస్తోందన్నారు.

అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా నగరాల్లో ప్రింట్, డిజిటల్ మీడియా కార్యక్రమాలతో కూడిన భారీ మార్కెటింగ్, పీఆర్ క్యాంపెయిన్ ద్వారా ఈ మైలురాయికి మరింత ప్రాచుర్యం కల్పించారు. సరదాగా సాగే ‘రెస్ట్ డే’ (“Rest Day”) సందేశం చుట్టూ రూపొందించిన ఈ క్యాంపెయిన్, వేడుకల్లో సభ్యులకే పెద్దపీట వేసింది. ఏళ్లుగా ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా వృద్ధిని తీర్చిదిద్దడంలో వారు పోషించిన పాత్రను గుర్తించింది. 200+ క్లబ్‌ల మైలురాయి బ్రాండ్ విస్తరణలో తదుపరి దశకు కూడా బాటలు వేస్తోంది.

2030 నాటికి దేశవ్యాప్తంగా 500 క్లబ్‌లను లక్ష్యంగా పెట్టుకున్న ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా, తన వృద్ధి వ్యూహంలో టైర్ 1, టైర్ 2 మార్కెట్లకు ముఖ్యమైన స్థానం ఇస్తోంది. స్థి శిక్షణ, పోషకాహారం, రికవరీ, చురుకైన జీవనశైలి అంశాలపై ట్రైనర్లు, సభ్యులు, ఫిట్‌నెస్ ప్రియులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయి. 200+ క్లబ్‌ల మైలురాయిని తన నెట్‌వర్క్ అంతటా ఘనంగా జరుపుకున్న ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా, విస్తృతమైన జాతీయ ఉనికి, పెరుగుతున్న సభ్యుల కమ్యూనిటీ, దేశంలోని మరిన్ని నగరాలకు నాణ్యమైన ఫిట్‌నెస్ అనుభవాలను చేరువ చేయాలన్న స్పష్టమైన లక్ష్యంతో తన వృద్ధిలో తదుపరి దశలోకి అడుగుపెడుతోంది.

మరిన్ని వార్తలు