సీసీ రోడ్డు పనులు ప్రారంభం
వెంకటాపూర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి(Baireddy Bhagavan Reddy, Director, Telangana State Panchayat Raj Department) ప్రారంభించారు. బుధవారం రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
మంత్రి సీతక్క చొరవతో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి భగవాన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో భూక్య శ్రీదేవి, ఉప సర్పంచ్ లింగస్వామి, వార్డు సభ్యుడు రవి, మాజీ ఎంపీపీ బుర్ర సమ్మయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.