అనురాగ్ లో ఎన్‌ఎస్‌ఎస్ రక్తదాన శిబిరం

14-10-2026 | 07:21pm

ఘట్ కేసర్ (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో యూనిట్లు 1, 2, 3, 5 సంయుక్తంగా జూబ్లీ హిల్స్ విఠల్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ సమక్షంలో జరిగింది. విద్యార్థులు, వాలంటీర్లు చూపిన ఉత్సాహాన్ని వారు అభినందిస్తూ, సామాజిక బాధ్యత, సమాజ సేవలో యువత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జె. రాజేంద్ర, డాక్టర్ టి. పురుషోత్తం, పి. చిన్న శ్రీనివాస్ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనర్లు టి. నవీన్, పి. వేణుగోపాల్,  టి. విద్యా సాగర్, అలాగే ఎన్‌సీసీ అధికారి ఫ్లయింగ్ ఆఫీసర్ సౌరభ్ బార్పుటే సమన్వయం చేశారు.

స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు, మానవతా విలువలు మరియు సామాజిక సేవ పట్ల యువతలో అవగాహన పెంపొందించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం. సుమారు 200 మంది రక్తదాతల భాగస్వామ్యం విశ్వవిద్యాలయ సమాజంలో సేవాభావం, కరుణ, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని వార్తలు