ఇమాన్వికి బర్త్‌డే ట్రీట్.. ఫుడ్‌తో ఫిదా చేసిన డార్లింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pan-India star Prabhas) మరోసారి తన ప్రత్యేకమైన ఆతిథ్యంతో వార్తల్లో నిలిచారు. ‘ఫౌజీ’ సినిమాలో తనతో కలిసి నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Esmail)కు పుట్టినరోజు సందర్భంగా రకరకాల వంటకాలతో కూడిన ప్రత్యేక విందును పంపించి సర్ప్రైజ్ చేశారు.
విభిన్న రకాల వంటకాలు, స్వీట్లతో నిండిన ఫుడ్ ట్రీట్(Food Treat) చూసి ఇమాన్వి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన మనసుతో పాటు కడుపు కూడా నిండిపోయిందనే భావనతో ఆమె చేసిన పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గోదారి బిడ్డంటే ఆ మాత్రం ఉండాల్సిందే!
ప్రభాస్‌కు మంచి భోజనం అంటే ఇష్టమని, తనతో పనిచేసేవారికి కూడా రుచికరమైన వంటకాలతో ఆతిథ్యం ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘గోదారి బిడ్డ.. ఫుడ్ విషయంలో తగ్గేదేలా!’ అంటూ డార్లింగ్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాతో ఇమాన్వి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. ఈ సినిమా నేపథ్యంలో ప్రభాస్, ఇమాన్వి జోడీపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, తాజా బర్త్‌డే సర్ప్రైజ్ సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.