ఆత్మహత్య చేసుకున్న రైతులు

14-10-2026 | 07:25pm

కుటుంబాలకి  రాష్ట్ర ప్రభుత్వం  పరిహారం ఇచ్చి ఆదుకోవాలి

తాంసి/భీంపూర్, అక్టోబర్ 14(విజయక్రాంతి): భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి(Pippal Koti village) చెందిన  భూర్గుల అశోక్,పసుల ఆశన్న అనే రైతులు(Farmers) గత కొన్ని రోజుల క్రితం మానసిక వేదనతో గురై తను నిర్మించుకున్న కొట్టంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్మ చేసుకున్న కుటుంబాలని బుధవారం రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న, రమాకాంత్ తో కలిసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.

వాస్తవ ఆర్థిక స్థితిగతులపై కుటుంబ సభ్యుల నుండి సమాచారం తీసుకుంటూ, వారు సాగుచేస్తున్న పంట భూమిలో  పత్తిపంటలో కందులు వేసి పండిస్తున్న  క్రమంలో పంటలకు అయినా  ఖర్చులకి మరియు  గత ఏడాదిలో ఆశించినంత పంట దిగుబడి రాక ,వారి కుటుంబ సభ్యుల ద్వారా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

వాస్తవంగా గత సంవత్సరం ఆగస్టు 16 నుండి నవంబర్ 04 వరకు కురిసిన అతి భారీ వర్షాలకి పంటలు ఎదుగకుండా మరొక పక్క ప్రకృతి విపత్తుల ద్వారా పంటలకి అధిక వర్షపాతలు నమోదు కావడంతో తాము సాగుచేసిన పంట భూమిలో ఆశించినంత పంట దిగుబడి రానందున మరియు ఈ ఖరీఫ్ లో ఆశించినంత పంట ఎదుగుదల  లేక పోవడంతో మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ యొక్క కుటుంబాలకి   మానవతా హృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన  GO నంబర్ 194 ప్రకారంగా ఆరు లక్షల రూపాయల పరిహారంతో పాటు ఈ కుటుంబాలకి  ఆర్థిక భరోసా కల్పించే విదంగా  ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని అయన అన్నారు.

కుటుంబ యజమానురాలికి నేలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలి. వీరి పిల్లలకు ఉన్నతమైన  ఉచిత విద్య, వైద్య సదుపాయాలు అందించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి.

గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయశాఖ వారు మరియు రెవెన్యూ సిబ్బంది  కలిసి  రైతు ఆత్మహత్యలు జరుగకుండా గ్రామ గ్రామాన అవగాహనా సదస్సులు నిర్వహించాలి. ప్రతి రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విదంగా చిరు ధాన్యలపై, ఆకు కూరగాయల  కోళ్ల పెంపకం,

పాడిగేదెల మేకల పెంపకం ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించే విదంగా మరియు నెలసరి ఆదాయం   రూ.15 వేలు ఉండే విదంగా   ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని సంగెపు బొర్రన్న తెలిపారు..ఆయనతో పాటు కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటట్ రమాకాంత్,  రవీందర్, శ్రీకాంత్,అమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు