నూతన పెన్షన్ మంజూరు ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ
నాగిరెడ్డిపేట్,నవంబర్ 21 (విజయ క్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో(Tandur Village) పెన్షన్ అర్హులకు నూతన పెన్షన్(Pension) మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు గ్రామ సర్పంచి యాదగౌడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి భూమా యాదా గౌడ్ మాట్లాడుతూ...గత కొన్ని సంవత్సరాలుగా భర్తలు మరణించి కుటుంబ పోషణ భారంగా,కనీస అవసరాలు తీర్చుకోవడం కష్టంగా, అనారోగ్యంతో మందులకు డబ్బులు లేక ఎన్నో కష్టాలతో జీవితం గడిపినవారికి జీవితాలలో పెన్షన్ అనే ఒక ధైర్యాన్ని నింపి బ్రతుకు పైన ఆశలు చిగురించేలా నూతన పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు(Madan Mohan Rao) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్,ఉపసర్పంచ్ అభిషేక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య,నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గుడ్డి వెంకనీ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి, జిపిఓ శంకర్,లబ్ధిదారులు పాల్గొన్నారు.