జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మేకల రాజేష్
వెంకటాపూర్ యువకుడికి కీలక బాధ్యత
వెంకటాపూర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన మేకల రాజేష్(Mekala Rajesh) నియమితులయ్యారు. శుక్రవారం జిల్లా యువజన కాంగ్రెస్ పూర్తి కమిటీని రాష్ట్ర మంత్రి సీతక్క(Seethakka), కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రకటించారు. ఈ కమిటీలో మేకల రాజేష్కు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించేందుకు సహకరించిన మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాది రామ్ రెడ్డి, కుంజ సూర్య, పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఈసర్ ఖాన్, నియోజకవర్గ అధ్యక్షుడు సుమన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీని ములుగు జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ సభ్యులను కలుపుకొని ముందుకు సాగుతూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని రాజేష్ తెలిపారు.