ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల లపై చిన్న చూపు తగదు

16-10-2026 | 05:41pm

నిర్మల్ అక్టోబర్ 16 ( విజయ క్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)(National Health Mission) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిని(Nirmal MLA Eleti Maheshwar Reddy) శుక్రవారం జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఆరోగ్య ఉద్యోగులపై చిన్నచూపు చూడడం సరికాదని తెలిపారు సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తూ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని తెలిపారు. 

తెలంగాణలో గత 20 ఏళ్లుగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సత్యం చంద్రకాంత్, కాదం అరవింద్, బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు