భక్తులకు దర్శనం ఇచ్చిన పర్వత వర్ధిని అమ్మవారు
యాదగిరిగుట్ట, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆరవ రోజు అమ్మవారు సరస్వతీదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
ఉదయం ప్రాతఃకాల పూజలో పారాయణాలు, అర్చనలు, శ్రీ దేవీ మూలమంత్రజపములు, మధ్యాహ్నం శ్రీ దేవీ చతుషష్టి ఉపచార పూజ నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాద వినియోగం జరిగినాయి. సాయంకాలం 5 గంటల నుండి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్,అర్చకులు, పారాయణికులు, భక్తులు పాల్గొన్నారు.