ఉపాధి పనుల్లో కూలీకి తేలు కాటు

16-10-2026 | 05:49pm

బాధితుడికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలి

వెంకటాపూర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఉపాధి హామీ పనులు(Employment guarantee works) చేస్తుండగా ఓ కూలీ తేలు కాటుకు(Fly bites) గురైన ఘటన ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ మండలం ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అడ్డగట్టుగుట్టపై విబిజి రాంజీ ఉపాధి హామీ పథకం(VBG Ramji Employment Guarantee Scheme) కింద పనులు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన కూలీ కామ కృష్ణమూర్తిని తేలు కుట్టింది. దీంతో అస్వస్థతకు గురైన ఆయనను తోటి కూలీలు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి(District Government Hospital) తరలించారు.

ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కామ అశోక్ స్పందిస్తూ, ఉపాధి హామీ పనులు చేస్తూ ప్రమాదానికి గురైన కూలీ కామ కృష్ణమూర్తికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. నిరుపేద కూలీలు ఉపాధి పనుల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారని, పనులు చేసే సమయంలో ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంతోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే ప్రమాద పరిహారం, ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కూలీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించే సదుపాయాలు కల్పించాలని కామ అశోక్ కోరారు.

మరిన్ని వార్తలు