గ్రామాల అబివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం

16-10-2026 | 05:49pm
  1. కిష్టంపేట గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా.. 
  2. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి, అక్టోబర్ 16,(విజయక్రాంతి ): గ్రామాభివృద్ధే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) అన్నారు.  చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు.. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

1995లో జిల్లా పరిషత్‌కు ఎన్నికైనప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో తాను, తన భార్య ప్రజాప్రతినిధులుగా పనిచేసిన పదేళ్ల కాలంలో అధికారంలో లేకపోయినా, అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలకు నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ దేవరాజు మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్ చొరవ వల్లే నిధులు మంజూరు అయ్యాయని హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అదిశ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవరాజు,ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు