దోమకొండలో నాలుగు లైన్ల రోడ్డుకు ప్రతిపాదనలు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌కు సర్పంచ్ ఐరెని నరసయ్య వినతి
దోమకొండ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలో సబ్‌స్టేషన్ నుంచి సంగమేశ్వర చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.14 కోట్ల నిధులు మంజూరు(Funds sanctioned) చేయాలని కోరుతూ సర్పంచ్ ఐరెని నరసయ్య శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ను(Government Advisor Shabbir) కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ నుంచి సంగమేశ్వర చౌరస్తా వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత శాఖ అధికారులకు నివేదిక పంపించినట్లు వివరించారు. నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, నేతుల మల్లేశం, నేతుల సుధాకర్, బత్తిని సిద్ధరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.