అంగన్వాడి టీచర్లకు,ఆశ వర్కర్లకు నూతన వస్త్రాలు పంపిణీ

20-11-2026 | 08:11pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ గ్రామ(Gopalpet village) వాస్తవ్యులు కీర్తిశేషులు చకిలం సుశీలమ్మ జ్ఞాపకార్థం వారి దత్త పుత్రుడు బూరుగుపల్లి ప్రవీణ్ తాండూర్ గ్రామపంచాయతీ(Tandur Gram Panchayat) సిబ్బందికి మరియు అంగన్వాడీ టీచర్లకు(Anganwadi teachers), ఆశావర్కర్లకు(ASHA workers) నూతన వస్త్రాలు గ్రామ సర్పంచ్ యాద గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచి భూమా యాద గౌడ్ మాట్లాడుతూ... గత 19 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 20వ తేదీన తప్పకుండా ఏదో ఒక రకమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవీణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.కీర్తిశేషులు చకిలం సుశీలమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్,గ్రామస్తులు పడమటి దుర్గేష్,సిబ్బంది రవి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు