వైభవంగా జరిగిన శ్రీభవానీ దేవి విగ్రహ ప్రతిష్ట
ఘట్ కేసర్, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) లోని కొండాపూర్ లో గల శ్రీకాశీ విశ్వేశ్వరుని దేవాలయంలో శ్రీభవానీ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. ముఖ్య అతిథిగా మల్లారెడ్డి విశ్వవిద్యా(Mallareddy University) పీట్ చైర్మన్, యువ నాయకులు డాక్టర్ చామకూర భధ్రారెడ్డి(Chamakura Bhadra Reddy) హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన అమ్మవారిని భక్తి శ్రద్దలతో(devotional) ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అలాగే ఆలయం తరపున నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్, ఘట్ కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకటరెడ్డి, చిలుకూరి హేమలత, బేతాళ నర్సింగ్ రావు, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపిటిసిలు చిలుకూరి గోపాల్ రెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, మేకల నర్సింగ్ రావు, మాజీ వార్డు సభ్యురాలు చందుపట్ల అశ్విని, నాయకులు జి. రవీందర్, ఎంపాల సుధాకర్ రెడ్డి, పడిగం వెంకటేశ్వరరావు, ములుగురం జంగయ్య, చందుపట్ల లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.