రామాపురం ప్రధాన రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

20-11-2026 | 08:03pm

రామాపురం / నవంబర్ 20 ( విజయక్రాంతి ) : నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ ప్రధాన రోడ్డు(Ramapuram Village Main Road) మీదుగా కొల్లాపూర్ నుండి వయా రామాపురం, పెబ్బేరు , కర్నూల్ వైపు ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలు నిత్యం రద్దీగా వెళ్లడం వలన రామాపురం వద్ద రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారి వాహనదారులు ప్రమాదాలకు(Motorists are at risk of accidents.) గురవుతున్న నేపథ్యంలో వెంటనే ఆర్ అండ్ బి అధికారులు(R&B Officials) స్పందించి సీసీ రోడ్డు(CC Road) నిర్మించాలని అన్నారు.

గతంలో ఎన్నో సార్లు కొల్లాపూర్ లోని మండల పరిషత్ కార్యాలయంలో(Mandal Parishad Office) జరిగిన ప్రజావాణిలో రామాపురం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు బిజ్జుల శేఖర్ రెడ్డి ఎంపీడీఓ వెంకట్రావు కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ. కొల్లాపూర్ నుండి రామాపురం, పెబ్బేరు, కర్నూల్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రధాన రహదారి అయిన రామాపురం ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు వర్షాలకు దెబ్బతిని గుంతలు పడి రోడ్డు ప్రమాదకరంగా మారి ఆర్టీసీ బస్సులు, బైక్ లు, ట్రాక్టర్ లు, రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అని ఆరోపించారు.

అదికారులు రోడ్లను ఎలాంటీ మరమ్మత్తులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామాపురం రోడ్డు నిర్మాణం పై స్థానిక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు. చేసి త్వరగా పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు గడ్డం శ్రీరాములు, బి ఆర్ యస్ నాయకులు రాంబాబు గౌడ్,రాఘవేంద్ర, నరేష్, బాలకృష్ణ, రాముడు, శ్రీరాములు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు