తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

06-10-2026 | 04:59pm

బోథ్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు గుంజల భాస్కర్ రెడ్డి(Gunjala Bhaskar Reddy) ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఉద్యమకారులపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. 14 సంవత్సరాలకాలం పాటు ఉద్యమంలో పాల్గొన్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెంటనే అమలుపరిచి నెలకు 25 వేల పెన్షన్ తో పాటు 250 గజాల ఇంటి స్థలం ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అమృత రావు పాటిల్, షేక్ మహిముద్, మడవి భీమ్ రావ్, షేక్ సంశుద్దిన్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు