జర్నలిస్టులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది...

29-09-2026 | 06:50pm

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి...

బాన్సువాడ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జర్నలిస్టులు నేటి సమాజంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ(Telangana Media Academy) ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు(Training Classes) మంగళవారం నిర్వహించారు.

బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, వార్తా ప్రసారం తదితర అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్న క్రమంలో వార్తలను వేగంగా అందించడంతో పాటు వాటి వాస్తవికతను నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వార్తలను ప్రచురించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా పనిచేసేలా వారిని తీర్చిదిద్దడం శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్,  ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ లతీఫ్, సాయ గౌడ్ మోయిన్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు