కీతవారిగూడెంలో భాగస్వామ్య గ్రామీణ విశ్లేషణ

29-09-2026 | 06:38pm

రైతులతో మమేకమైన అగ్రికల్చర్ విద్యార్థినులు.. సమస్యలు, వనరులపై అధ్యయనం

గరిడేపల్లి సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం, గ్రామంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా కళాశాలకు చెందిన బి.ఎస్సీ. అగ్రికల్చర్ విద్యార్థినులు కీతవారిగూడెంలో భాగస్వామ్య గ్రామీణ విశ్లేషణ(Participatory Rural Appraisal) కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతులతో మమేకమై గ్రామ పరిస్థితులు, వ్యవసాయ సమస్యలు, అందుబాటులో ఉన్న వనరులపై అధ్యయనం చేశారు.ఈ సందర్భంగా పీఆర్‌ఏ ప్రాధాన్యత, గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, స్థానిక వనరుల సమర్థ వినియోగంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు, రైతుల అభిప్రాయాలను సేకరించి సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించారు. వాటి ఆధారంగా పరిష్కార మార్గాలను సమిష్టిగా రూపొందించే విధానాన్ని వివరించారు.కార్యక్రమంలో విద్యార్థినులు సామాజిక పటం, వనరుల పటం, కాలానుగుణ విశ్లేషణ చేపట్టారు. గ్రామంలోని కుటుంబాలు, పాఠశాల, తాగునీటి వనరులు, రహదారులు తదితరాలను సామాజిక పటంలో గుర్తించారు.

సాగుభూములు, నీటి వనరులు, పశుసంపద, పంటల పరిస్థితులను వనరుల పటం ద్వారా నమోదు చేశారు. పంటల సాగు కాలాలు, వర్షపాతం, నీటి లభ్యత, సీజనల్ సమస్యలపై రైతులతో చర్చించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఏ. నరేష్, ఆదర్శ్, సర్పంచ్ బొల్లేపల్లి రామనాధం, రైతులు గూడేపు శ్రీనివాస్, బడేటి బడేటి వినయ్, జ్యోతి, చిత్తలూరి అంజయ్య, బొల్లేపల్లి నాగమ్మ, ఎల్లావుల అంజయ్య, దాసరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.విద్యార్థినులు ఎం. నవ్యశ్రీ, ఆర్. మోనికా, వై. మనీషా, పి. హేమలత, ఐ. సత్యజ్యోతి, వై. సౌమ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు