తల్లి, బిడ్డల ఎదుగుదలకు పోషకాహారం తప్పనిసరి

29-09-2026 | 06:50pm

సర్పంచ్ మాతంగి. వెంకటమ్మ.

తుంగతుర్తి( విజయ క్రాంతి): తల్లి ,బిడ్డల ఎదుగుదలకు పోషక ఆహారం తప్పనిసరని సర్పంచ్ మాతంగి వెంకటమ్మ(Sarpanch Matangi Venkatamma) అన్నారు.గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాస కార్యక్రమం అంగన్వాడీ టీచర్ గుండగాని శోభ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డల ఎదుగుదలకు పోషకాహారం ప్రాముఖ్యత ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రమీల, సర్పంచ్ మాతంగి వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఎనగందుల లావణ్య ,అంగన్వాడీ టీచర్లు జ్యోతి, అంజలి ఆశా కార్యకర్త రమ, గర్భిణీలు, బాలింతలు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు