నేరేడుచర్ల సెక్టార్ స్థాయిలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవo

29-09-2026 | 06:45pm

నేరేడుచర్ల,సెప్టెంబర్ 29(విజయ క్రాంతి):సూర్యాపేట జిల్లా,నేరేడుచర్ల లో  మంగళవారం నాడు సెక్టార్ స్థాయి 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి(Municipal Chairperson Konatham Chinna Venkat Reddy) మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మన ప్రాంతంలో సులభంగా లభించే స్థానిక మరియు సాంప్రదాయ,

ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు తదితర స్థానిక ఆహార పదార్థాల వినియోగం ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

సీడీపీఓ హడావత్ పార్వతి మాట్లాడుతూ, “మన అంగన్వాడి – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి సహకరించాలని అన్నారు. చిన్నారులకు, గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ఈ 

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్. సందీప్ రెడ్డి,కమిషనర్ నాగరాజు, ఆర్‌ఐ చంద్రకళ, హెల్త్ సూపర్‌వైజర్ దానమ్మ, అంగన్వాడీ సూపర్‌వైజర్లు రాజ్యలక్ష్మి, యశోద, ధరణి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాజేష్, సెక్టార్ లీడర్ పాపమ్మ, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణి స్త్రీలకు శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసిన వివిధ పోషకాహార వంటకాలను ప్రదర్శించి, వాటి పోషక విలువలపై అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు