ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు
తాడ్వాయి,నవంబర్,24( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో(Endriyala Village) మంగళవారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తొలి స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు బాణాల గంగారెడ్డి,కార్యదర్శి రెడ్డి గారి సిద్ధిరాం రెడ్డి,ఉప సర్పంచ్ గడ్డం నర్సారెడ్డి,నాయకులు రెడ్డి గారి తిరుపతిరెడ్డి,గుండ్రెడ్డి మనోజ్ రెడ్డి,మోహన్ రెడ్డి, బాణాల చిన్న గంగారెడ్డి,బాలరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.