కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక శోభలో రామప్ప ఆలయం

24-11-2026 | 03:28pm

ములుగు జిల్లా, వెంకటాపూర్, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం భక్తుల సందడితో కళకళలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు (Karthika Deepams) వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ పరిసరాలు దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం విశేష పుణ్యఫలదాయకమని భక్తులు విశ్వసిస్తారు. దీంతో ఉదయం నుంచే భక్తుల రాక కొనసాగింది. రామప్ప శిల్పకళా వైభవాన్ని (Architectural Heritage) తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయం కార్తీక పౌర్ణమి వేడుకలతో మరోసారి ఆధ్యాత్మిక కళను (Spiritual Grandeur) సంతరించుకుంది.

మరిన్ని వార్తలు