అచ్చంపేటలో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
అచ్చంపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన (CM Visit) నేపథ్యంలో అచ్చంపేట పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ (Parking), పటిష్ట భద్రత (Security), ట్రాఫిక్ నియంత్రణ (Traffic Control) చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం లింగాల రోడ్డులోని ఆర్టీసీ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ (Helipad) ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి సీఎం పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాన్ని తనిఖీ చేశారు. అంబేద్కర్ కూడలిలో విగ్రహానికి నివాళులర్పించే ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.