మాజీ జడ్పీ చైర్మన్ పూజలు

24-11-2026 | 03:22pm

నిర్మల్ నవంబర్ 24 ( విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమిని(Karthika Pournami) పురస్కరించుకుని సోన్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీశ్రీశ్రీ గొడిసెర్యాల రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాజీ జడ్పీ చైర్‌ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సదానంద స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏకబిల్వం మొక్కను నాటారు. శివుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాఫ్రాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు