భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్య

30-10-2026 | 10:25pm

ముగ్గురు నిందితులను అరెస్ట్, రిమాండ్

బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి వెల్లడి

బాన్సువాడ,(విజయక్రాంతి): భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ మండలం హన్మాజీపేట్ లో చోటు చేసుకున్న కేసును బాన్సువాడ పోలీసులు చేదించారు.ఈ నెల 23వ తేదీన కాశీరామ్ అనే యువకుడిని హత్య చేసి చెరువులో పడేసిన కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం బాన్సువాడ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ... మృతుడు కాశీరామ్ భార్య సవితకు, వరుసకు మరిది అయిన సంతోష్ తో అక్రమ సంబంధం ఉంది. భర్త కాశీరామ్ ను అడ్డు తొలగించుకోవాలని సవిత, సంతోష్ పథకం వేశారు.

దీనికి మరో యువకుడు రామును కూడా కలుపుకున్నారు.మృతుడు కాశీరామ్ కు, రాముకు మరో మహిళ గంగామణితో కూడా అక్రమ సంబంధం ఉంది. రాము ప్రియురాలు అయిన గంగామణి నుండి కాశీరామ్ ను దూరం చేయాలనే ఉద్దేశంతో రాము కూడా ఈ హత్యలో పాల్గొన్నాడు. దీంతో రాము, సంతోష్, మృతుడి భార్య సవిత ముగ్గురు కలిసి కాశీరామ్ ను చంపాలని ప్రణాళిక వేశారు.పథకం ప్రకారం ఈ నెల 23వ తేదీన కాశీరామ్ కు మద్యం తాగించి, తాడుతో ఉరి వేసి హత్య చేసి, సంతోష్, రాము కలిసి మృతదేహాన్ని చెరువులో పడేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతోష్, రాము, సవితలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ తుల శ్రీధర్ ఉన్నారు.

మరిన్ని వార్తలు