నషా ముక్త్ భారత్ కోసం కృషి చేద్దాం

28-10-2026 | 09:00pm

కలెక్టర్ చిత్రా మిశ్రా

ముకరంపుర, అక్టోబర్ 28(విజయ క్రాంతి): నషా ముక్త్ భారత్(Drug-Free India) కోసం అందరం కృషి చేద్దామని .. జీవితాలను చిన్నాభిన్నం చేసే పొగాకు, గుట్కా తదితర మత్తు పదార్థాల అలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరం ఉండాలని కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ, ఓయూ ఎన్ఎస్ఎస్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్-2047 అవగాహన కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో వర్చువల్ గా వీక్షించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వర్చువల్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్  మాట్లాడారు.

మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతోపాటు కుటుంబానికి, సమాజానికి నష్టం కలిగిస్తుందన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ స్థాపన కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల  నియంత్రణకు పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, విద్యా శాఖ, తదితర శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కలెక్టర్.. వివిధ శాఖల అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు, విద్యార్థులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ చైర్మన్ సంగేం లక్ష్మణరావు, మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ‘నషాముక్త్ భారత్’ అవగాహన ర్యాలీ 

గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ , ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్వో రాజ్ గోపాల్ రావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు