ఓటు హక్కు పరిరక్షణ కోసం ఢిల్లీకి కాంగ్రెస్ బస్సు యాత్ర

30-10-2026 | 05:29pm

కరీంనగర్ సిటీ అక్టోబర్30 (విజయక్రాంతి): ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నవంబర్ 1న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ – ఓటు బచావో.. దేశ్ బచావో.. సేవ్ డెమోక్రసీ.. సేవ్ ఇండియా ర్యాలీలో పాల్గొనేందుకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుమారు 40 మందితో కూడిన బస్సు ఢిల్లీకి బయలుదేరింది.

ఈ బస్సును కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కు స్వేచ్ఛను కాపాడేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరినట్లు తెలిపారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు