డిహెచ్ పిఎస్ వార్షికోత్సవాలు జయప్రదం చేయండి
ముకరంపుర, నవంబర్ 24(విజయ క్రాంతి): ఈనెల 29, 30 తేదీలలో హైదరాబాదులో జరుగు డి హెచ్ పి ఎస్(DHPS) 20వ వార్షికోత్సవాలు విజయవంతం చేయాలని కరీంనగర్ సిపిఐ పార్టీ కార్యాలయం(CPI Party Office) బద్దం ఎల్లారెడ్డి భవనంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి హెచ్ పి ఎస్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బోయిని అశోక్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం బోయిని అశోక్, బోయిని తిరుపతి లు మాట్లాడుతూ ఈ నెల 29న హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సభ జరుగునని మరునాడు 30న సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రతినిధుల మహాసభ జరుగును.
కావున కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల నుండి డి హెచ్ పి ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజకుమార్, మురళి యుగంధర్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు.