ఎన్ఐఎన్ కాలనీ ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

24-11-2026 | 04:18pm

మేడిపల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర శివాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు (Abhishekams), పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన (Deepa Aradhana) చేశారు.

ఒకే ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, పరమశివుడు, ఆంజనేయ స్వామి కొలువుదీరడం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠాపనతో ఈ ఆలయం త్రిమూర్తుల దివ్యక్షేత్రంగా భక్తులకు దర్శనమిస్తోంది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దీటి గణేష్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం (Sanatana Dharma), భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే ఆలయ లక్ష్యమని తెలిపారు. భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివార్ల ఆశీస్సులు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ చైర్మన్ ఏనుగు ప్రతాపరెడ్డి, కాలనీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ కొండా ఐలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి నంగునూరి నాగరాజు, సలహాదారు జి. సత్యనారాయణ యాదవ్, కార్యదర్శి పి. ఉమేష్ రెడ్డి, మైస సోమయ్య, అక్కేం మల్లేష్ యాదవ్, శ్యామ్ కుమార్ యాదవ్, బొడ్డు మల్లేష్ యాదవ్, మత్తి వెంకటేశ్వర్లు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు