బజారత్నూర్‌లో పంటల చోరీలు
బోథ్, నవంబర్ 22 (విజయక్రాంతి): బజారత్నూర్ మండలంలోని రైతుల పొలాల్లో పత్తి, సోయాబీన్ పంటల (Crops) దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ అధికారులు వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమానాస్పదంగా తీసుకొచ్చే పంటలను కొనుగోలు (Purchase) చేయవద్దని కోరారు.
దొంగతనంగా తీసుకొచ్చిన పంటలను కొనుగోలు చేయకుండా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారి వివరాలను వెంటనే గ్రామపంచాయతీకి అందించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో దొంగతనాలను (Theft) అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని గ్రామపంచాయతీ ప్రతినిధులు కోరారు.