చేగుంటలో ఘనంగా గురునానక్ 557వ జయంతి వేడుకలు

24-11-2026 | 04:42pm

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

చేగుంట నవంబర్ 24,విజయక్రాంతి: సిక్కు మత గురువు, సత్యం, శాంతి, సేవాభావానికి ప్రతీక అయిన శ్రీ గురునానక్ దేవ్ జీ(Shri Guru Nanak Dev Ji) 557వ జయంతి వేడుకలను చేగుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో గురునానక్‌కు ప్రార్థనలు చేశారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గురునానక్ బోధించిన సమానత్వం, సోదరభావం, మానవసేవ వంటి సందేశాలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను భక్తి వాతావరణంలో ఆనందోత్సాహాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ గురువేందర్ సింగ్, జస్బీర్ సింగ్, సుప్రీత్ సింగ్, అర్జిత్ సింగ్, సద్నాన్ సింగ్, అర్జున్ సింగ్, బాబు సింగ్,భక్తులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు