కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రోత్సాహంతో నేత్రదానం

15-10-2026 | 08:12pm

కొత్తపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కరీంనగర్‌పట్టణం లోని మెడికోవర్ హాస్పిటల్స్‌లో(Medicover Hospitals) గంటా రమణయ్య  (65 ఏళ్లు) మరనించగా వారి కుటుంబ సభ్యులను  లయన్స్ క్లబ్(Karimnagar Lions Club) సభ్యులు కోల అన్నారెడ్డి  మరియు మ్యాడం శివకాంత్ పటేల్ కలసి మాట్లాడగా నేత్రదానానికి చేయడానికి ముందుకు రావడం జరిగింది.

వైద్య బృందం సహకారంతో మరియు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రతినిధి గాజుల సతీష్ సమన్వయంతో నేత్రదాన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీని ద్వారా చూపు కోల్పోయిన వారికి తిరిగి దృష్టిని ప్రసాదించే అవకాశం కలిగిందని లయన్స్ క్లబ్ వారు తెలిపారు.

మరిన్ని వార్తలు