ఎస్.ఆర్.ఆర్. లో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
ముకరంపుర, నవంబర్ 5 (విజయ క్రాంతి): కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో(S.R.R. Government Arts and Science College) జాతీయ సేవా పథకం యూనిట్ల ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, కరీంనగర్ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు కలిపి దాదాపు 279 మంది ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ శిబిరంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సోహైల్, డాక్టర్ దివ్య పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి సమస్యల నివారణ, కంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ ఎం. నవీన్ శిబిరం నిర్వహణలో సహకరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ, నేటి జీవనశైలిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.